వసతి గృహ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలి . సీఐటీయు డిమాండ్ 

Jun 30, 2025 - 19:22
 0  13
వసతి గృహ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలి . సీఐటీయు డిమాండ్ 

జోగులాంబ గద్వాల 30 జూన్ 2025తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల  జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహ కార్మికులకు విడుదలైన మూడు నెలల వేతనాలు వెంటనే వారి ఖాతాలలో జమ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వివి  నరసింహా డిమాండ్ చేసారు.సోమవారం ప్రజావాణి సందర్భంగా వేతనాల విడుదలకు కలెక్టర్ కి వినతిపత్రం అందించారు.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు  పెండింగ్లో ఉన్నాయని అన్నారు. మూడు నెలలకు సంబంధించిన వేతనాలు జిల్లా సంక్షేమ కార్యాలయానికి వచ్చినప్పటికీ ఇంకా కార్మికుల ఖాతాలో జమ చేయలేదని అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు ఏ అధికారి పూర్తి బాధ్యతలు తీసుకోకపోవడంతో వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారని అన్నారు.అందువల్ల కార్మికుల వేతనాలకు సంబంధించిన ఫైల్ ను పెండింగ్లో పెట్టారని అన్నారు. కార్మికులు గత ఎనిమిది నెలలుగా వేతనాలు రాక ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబ పోషణ బరువై  తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఎస్సీ సంక్షేమ శాఖకు పూర్తిస్థాయిలో అధికారులను నియమించి కార్మికులకు సంబంధించిన వేతనాలు వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి కార్మికులపై అదనపు పని భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా కళాశాల వసతి గృహాలలో డేలివైస్ క్యాటరింగ్ పద్ధతుల్లో  కార్మికులు అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారని తెలిపారు.జిల్లా సంక్షేమ శాఖ  ఖాళీ పోస్టులను భర్తీ చేసే నియామక ప్రక్రియలో కళాశాల వసతి గృహ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించి కార్మికుల ఖాతాలలో పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా జమ చేసే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ వసతి గృహ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఆనంద రాజు  జిల్లా ఉపాధ్యక్షులు శశికళ కమిటీ సభ్యులు హైమావతి రామేశ్వరమ్మ అనిల్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లు

1. ఎస్సీ సంక్షేమ శాఖకు పూర్తిస్థాయిలో అధికారిని నియమించి మూడు నెలల వేతనాలు కార్మికుల ఖాతాలో జమ చేయాలి.
2. వచ్చే నోటిఫికేషన్ లో కళాశాల వసతి గృహ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
3. బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 8 నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయాలి చేయాలని సిఐటియు వారు డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333