గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి.

Feb 13, 2026 - 19:17
Feb 13, 2026 - 19:24
 0  33
గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి.

- ప్రజల తీర్పును, ఎన్నికల ఫలితాలను ప్రతిఒక్కరూ గౌరవించాలి.

- విజయోత్సవ ర్యాలీలకు, బాణాసంచా కు అనుమతి లేదు.

- ఎన్నికల నిర్వహణలో పని చేసిన సిబ్బందికి అభినందనలు, సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేది వరకు, మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్నికైయ్యే వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది కావున మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలోపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజల తీర్పును ఎన్నికల ఫలితాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరారు. వార్డులో కాలనీలో ఎవరు కూడా గొడవలు పెట్టుకోకూడదని, వ్యక్తులను ఉద్దేశిస్తూ కించపరిచేలా మాట్లాడకూడదని తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా నందు ప్రచారం చేయకూడదని కోరారు. యువత ఆదర్శంగా ఉండాలని ద్విచక్ర వాహనాలపై వేగంగా తిరుగుతూ ప్రమాదాలకు గురికాకూడదని కోరారు. గెలిచిన వారు బాధ్యతగా ఉండాలి, ఒడినవారు కృంగిపోకుండా ప్రజల అభిమానం పొంది మరో అవకాశం కోసం వేచిచూడాలి అన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలి అన్నారు.

మహా యజ్ఞంలా సాగిన మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో ప్రజల భద్రత, ఓటర్ల భద్రత పట్ల పనిచేసిన, బందోబస్తు నిర్వహించిన ప్రతి పోలీసు సిబ్బందికి ఎస్పి గారు అభినందనలు తెలియజేశారు. పోలీసు అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేసి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేశారని కొనియాడారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన వివిధ శాఖల సిబ్బందికి అభినందనలు తెలిపారు అలాగే సహకరించిన ఓటర్లకు అభ్యర్థులకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మరింత పటిష్టంగా పనిచేసి ప్రజలకు పోలీస్ సేవలు అందిస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళి ముగిసే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కాలనీలు, వార్డుల్లో నిఘా ఉంచాలని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333