నంది పురస్కారానికి ఎన్నికైన మద్దూరు గోవర్ధన్ రెడ్డి

Nov 19, 2024 - 17:04
 0  19
నంది పురస్కారానికి ఎన్నికైన మద్దూరు గోవర్ధన్ రెడ్డి

జోగులాంబ గద్వాల 19 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా, రాజోలి మండలం, రాజోలి గ్రామానికి చెందిన మద్దూరు గోవర్ధన్ రెడ్డి సామాజిక సేవా విభాగంలో నంది అవార్డుకు ఎంపికయ్యారు.నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని ఉన్నత అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అక్రమ ఇసుక,అక్రమ మట్టి దందాలకు అడ్డుకట్ట వేస్తూ సహజ వనరుల పరిరక్షణ కోసం కృషి చేస్తూ సమస్యలతో తన దగ్గరికి వచ్చిన వారికి అండగా నిలుస్తూ ఆపదలో ఉన్న వారికి నిత్యవసర వస్తువులు, ఆర్థిక సాయం అందజేస్తూ సామాజిక సేవలో ముందుకెళ్తున్న మద్దూరు గోవర్ధన్ రెడ్డి సేవలను గుర్తించిన జి సి ఎస్ వల్లూరి ఫౌండేషన్ వారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అతిధిగా ఆహ్వానిస్తూ నంది అవార్డుతో సత్కరించబోతున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మానవత్వం ఉన్న వ్యక్తులుగా సమాజానికి మన వంతు బాధ్యతగా ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తూ సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333