ఉపాధ్యాయులకు క్యాంపియన్ 5.0 కార్యక్రమం పై సమగ్ర సమీక్ష సమావేశం.
జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి మరియు ఇటిక్యాల మండలాల ప్రధానోపాధ్యాయుల సమావేశం సందర్భంలో క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంపై ఈరోజు కొండేరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందుసమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి., జిల్లా కోఆర్డినేటర్లు శాంతిరాజ్ , హంపయ్య ,రాజేంద్ర AE,మహమ్మద్ అజాం హాజరై వివిధ అజెండా అంశాలపై విస్తృతంగా సమీక్ష చేపట్టారు.
???? సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు:
1️⃣ క్యాంపెయిన్ 5.0
పాఠశాలల పరిశుభ్రత, ప్రమాదకర భవనాల కూల్చివేత, పెయింటింగ్ పనుల పురోగతి.
2️⃣ సివిల్ వర్క్స్
మండల పరిధిలోని పాఠశాలల సివిల్ పనుల ప్రస్తుత స్థితి నివేదిక.
3️⃣ ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు
పాఠశాలలలో ఇంటర్నెట్ సమస్యలు, టెక్నికల్ ఇష్యూలు మరియు పరిష్కార సూచనలు.
4️⃣ UDISE డేటా
డేటా ఎంట్రీ, లోపాలు, సరిచేసే చర్యలు మరియు పూర్తి చేసే గడువులు.
5️⃣ ఫిజిక్స్ వాల్లా / ఖాన్ అకాడమీ
ఫీల్డ్ స్థాయిలో డిజిటల్ లెర్నింగ్ అమలు పురోగతి మరియు విద్యార్థుల వినియోగంపై సమీక్ష.
6️⃣ FLN – AXL ల్యాబ్‌లు
ల్యాబ్‌ల ఫంక్షనాలిటీ, వనరులు, వినియోగం మరియు మెరుగుదల అవసరాలు.
7️⃣ లైబ్రరీ రూమ్‌లు
లైబ్రరీల అందుబాటు, వనరుల స్థితి మరియు అవసరమైన అభివృద్ధి చర్యలు.
ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండల విద్యాశాఖ అధికారి *శ్రీ అమీర్ పాష *, *ఇటిక్యాల మండల విద్యాశాఖ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు *, రెండు మండలాల *ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.