ఆశా కార్యకర్తలకు, ఆశ యూనిఫామ్ చీరలు పంపిణీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  వైద్యాధికారి :-డాక్టర్ జె సంధ్య కిరణ్మయి

Nov 20, 2025 - 15:57
 0  114
ఆశా కార్యకర్తలకు, ఆశ యూనిఫామ్ చీరలు పంపిణీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  వైద్యాధికారి :-డాక్టర్ జె సంధ్య కిరణ్మయి

 ప్రోగ్రామ్ ఆఫీసర్లు, మరియు వైద్య సిబ్బంది..

జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఇన్చార్జ్ డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి  ఆధ్వర్యంలో ఈరోజు ఆశా కార్యకర్తలకు యూనిఫామ్  చీరలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి  మాట్లాడుతూ. జోగులాంబ గద్వాల జిల్లా లో మొత్తం 604 మంది ఆశా కార్యకర్తలకు 1212 చీరలు సరఫరా ఐనవని, ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ద్వారా, వారి వారి పీహెచ్సీల యందు త్వరలో ఆశల అందరికీ  యూనిఫామ్  ఇస్తారని సందర్భంగా తెలిపారు.. ఆశా కార్యకర్తలు వారి డ్యూటీ నందు యూనిఫామ్ ధరించి అన్ని ఆరోగ్య కార్యక్రమాలలో పాల్గొనాలని  ఈ సందర్భంగా తెలిపారు...


    ఇట్టి కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసూనారాణి, డిప్యూటీ. డెమో, మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎన్సిడి కోఆర్డినేటర్ శ్యాంసుందర్, రామాంజనేయులు (DDM ),గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్, ఆశా కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333