ఉపాధి కూలీలతో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- బొప్పారం గ్రామంలోలోక్‌సభ ఎన్నికల ప్రచార క్రమంలో TPCC రాష్ట్ర నాయకులు, దళిత రత్న బాషపంగు భాస్కర్ గారు ఈరోజు ఉపాధి హామీ కూలీలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా పని జరుగుతున్న తీరు మరియు సౌకర్యాల గురించి ఆరా తీశారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఆలోచించే పార్టీ అనీ *గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఎండాకాలం కూడా ఉపాధి కల్పించి, పేదరికం తొలగించడానికి UPA ప్రభుత్వం(కాంగ్రెస్ ప్రభుత్వం) మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం గుర్తు చేశారు*. మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలలు కనీస వేతనం 400/- చేస్తామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగష్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల లోపు ఋణ మాఫీ చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలలో నాలుగు అమలు చేస్తున్నామని, ఎన్నికల కోడ్ ముగియగానే మొత్తం హామీలు అమలు చేస్తామన్నారు. గ్రామంలో అర్హులు అయిన ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా పక్కా ఇండ్లు మంజూరు చేపించే బాధ్యత నాదే అన్నారు. *గత పాలకులు పదేండ్లు ఊరిని ఏ విధంగా దోపిడి చేశారో, ఎలా వెనుకబాటుకు గురి చేశారో వివరించారు. అటు ఢిల్లీలో లేని, ఇటు గల్లిలో లేని తెరాస పార్టీకి ఓటేస్తే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని అన్నారు.* కాబట్టి, గ్రామస్థులంతా ఏకతాటి మీద నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాని అవడానికి కృషి చేయాలని, తద్వారా గ్రామ అభివృద్ధి మనమే ముందుండి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ వెంకట్ రెడ్డి గారు, జటంగి వెంకన్న గారు,జటంగి గురువయ్య గారు, నల్లగాటి నాగయ్య గారు, బాషపంగు రవీందర్ గారు, జటంగి బాలకృష్ణ గారు, పాల్వాయి మల్లయ్య గారు, చింతలచెరువు నగేష్ గారు, జంగం కళ్యాణ్ గారు, పరుశరామ్, నవీన్,సమరం రాజ్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.