బిజెపిని ఓడించండి, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించండి

May 10, 2024 - 19:32
May 10, 2024 - 19:49
 0  3
బిజెపిని ఓడించండి, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించండి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:-  బిజెపిని ఓడించండి, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించండి పార్లమెంటు ఎన్నికలలో ఫాసిస్టు మతోన్మాద బిజెపిని ఓడించాలని, ప్రజా వ్యతిరేక బిఆర్ఎస్ ను తిరస్కరించాలని, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించాలంటూ సిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు (ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామం లో ఉపాధి హామీ కూలీల వద్ద కరపత్రాలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా *ఐఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య పాల్గొని* మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, లౌకిక శక్తులను అణిచివేస్తూ నిర్బంధాన్ని ప్రయోగిస్తూ దేశద్రోహం పేరుతో ప్రజాస్వామిక వాదులపై పి డి యాక్ట్ ను అమలు చేస్తున్న, మతోన్మాద విషపు బీజాలను ప్రజల మెదలల్లో చొప్పిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఈడి, ఐటి, ఎన్ఐఏలను వినియోగించి ప్రతిపక్షాలపై దాడులు, ముఖ్యమంత్రుల సైతం అక్రమ అరెస్టులు, జైలలో నిర్బంధించడం రాజ్య హింసకు పరాకాష్ట ని అన్నారు. కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలను, లేబర్ కోడ్ లను కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా మలిచారని విమర్శించారు. ఢిల్లీలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన 750 మందిపైగా రైతులను మోడీ ప్రభుత్వం బలి తీసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్ల పై ఈ పదేళ్ల పాలనలో మరింత దాడులు, హింస పెరిగిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను, అటవీ సంపదలను, సహజ వనరులను ఆదాని, అంబానీలకు దారా దత్తం చేస్తున్నారని అన్నారు. మోడీ పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని, మోడీ గ్యారెంటీలు నినాదంగానే మిగిలిందని, ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో 15 లక్షల జమా గాలికి వదిలేసారని, ప్రజలను మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవడానికి బిజెపి ప్రయత్నిస్తుందని, దేశంలో ప్రమాదకర పరిస్థితులను నెలకొన్నాయని, ఈ విధానాలను అర్థం చేసుకొని ప్రజలు బిజెపిని ఓడించాలని, బలమైన ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. *ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి,చూడి సత్తిరెడ్డి,చూడి లింగారెడ్డి,దేవకమ్మ,రేణుకా,ఐలమ్మ,స్వరూప,సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.*