గాలికి నేలకొరిగిన వేప వృక్షం

Apr 8, 2025 - 19:26
Apr 8, 2025 - 19:38
 0  96
గాలికి నేలకొరిగిన వేప వృక్షం

అడ్డగూడూరు 08 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కొండంపేట మంగమ్మ గూడెం గ్రామ రహదారి మధ్యలో సోమవారం రోజు రాత్రి విపరీతమైన గాలికి నేలకొరిగిన చెట్టు?పట్టించుకున్న నాథుడే లేడు..వాహనదారులకు ప్రమాదానికి పొంచి ఉన్న విరిగిపోయిన చెట్టు రాత్రి వేళలో వాహనదారులు మోత్కూరు అడ్డగూడూరు తిరుమలగిరి నుండి వెల్దేవి వరకూ ప్రయాణం సాగిస్తుంటారు.ఈ చెట్టు ప్రమాదానికి పొంచి ఉందని వాహనదారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలలో సర్పంచ్లు లేక సంవత్సరం గడుస్తున్న ఎవరిని అడగాలో తెలవట్లేదని వాహనదారులు అన్నారు. పట్టించుకోని ఆర్ అండ్ బి వ్యవస్థ,కొండంపేట గ్రామ కార్యదర్శి త్వరగా చెట్టును తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. నిత్యం శాలిగౌరారం మండలం నుండి మోత్కూరు తిరుమలగిరి వరకు వాహనదారులు ప్రయాణం సాగిస్తుంటారని అన్నారు.