కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తికి 3సంవత్సరాలు జైలు శిక్ష 3వేలు జరిమానా

Sep 18, 2024 - 20:53
 0  369
కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తికి 3సంవత్సరాలు జైలు శిక్ష 3వేలు జరిమానా

అడ్డగూడూరు18 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కర్రతో 12 సం.ల బలుడుని రక్త గాయాలు అయ్యే విధంగా కొట్టి గాయపరిచిన కేసులో వ్యక్తికి 3 సం.ల జైలు శిక్ష తోపాటుగా 3 వెలు రూపాయల జరిమానా విధిస్తూ రామన్నపేట అదనపు జూనియర్ ఫస్టక్లాస్ మేజిస్ట్రేట్ యస్.చందన బుదవారం తీర్పునిచ్చారు.కొండంపేట గ్రామానికి చెందిన ఇటికాల వెంకన్న అను వ్యక్తి తన భార్య ఇటికల రాధికా యొక్క అక్క అయిన పాలడుగు రేణుక మరియు ఆమె కొడుకైన పాలడుగు గణేష్ 12 సం. లు ఇద్దరు చుట్టపుగా చూపుగా ఇటికల వెంకన్న ఇంటికి రాగా, తేది:30.09.2018రోజున రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో ఇటికల వెంకన్న బహిర్బుమి కోసం అని పాలడుగు గణేశ్ ను ఊరు బయటకు తీసుకు వచ్చి,అకారణంగా, మధ్యం మత్తులో గణేశ్ ను వెంకన్న కర్ర తో చితకా బాది,తీవ్ర రక్త గాయాలు అయ్యే విధంగా కొట్టినాడు.ఇట్టి విషయం పై బాలుడి తాత అయిన ఎర్ర లింగయ్య అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా,అప్పటి ఎస్సై పి . శివనాగప్రసాద్ కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించి చార్జ్ షీట్ దాఖలు చేశారు.నేరారోపణలు ఋజువు కావడంతో ఇటికల వెంకన్నకు 3 సం.ల జైలు శిక్షతో పాటుగా 3 వెయ్యిల రూపాయలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ చందన తీర్పునిచ్చారు.బదితుడి తరుపున ఏపిపి అవినాష్ వాదనలు వినిపించగా నిందితుడికి శిక్షపడేలా కృషి చేశినా ఎస్సై శివనాగప్రసాద్ ని, కోర్ట్ కానిస్టేబుల్ కప్పల నరేశ్ ని చౌటుప్పల్ ఏసిపి మధు సుధాన్ రెడ్డి అభినంధించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333