వినూత్న హాస్పిటల్స్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి
వినూత్న హస్పటల్ వార్షికోత్సవ సంబరాలు

సూర్యాపేట, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
వినూత్న హాస్పిటల్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ప్రముఖ వైద్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం లో వినూత్న హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు వార్షికోత్సవ సూర్యాపేట పట్టణంలో వినూత్న గ్యాస్, న్యూరో హాస్పిటల్ రావడం పేద ప్రజలకు ఎంతో అదృష్టమని అన్నారు. ఒక పేషంటు కు సీరియస్ అయిన సందర్భంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి పంపిస్తే అందులో లక్షల కొద్ది డబ్బులు ఖర్చు అవుతున్నాయని అందుకు అనుగుణంగా సూర్యాపేట పట్నంలో తక్కువ ఖర్చుతో వినూత్న హాస్పటల్ లో ప్రజలకు వైద్యం అందిస్తున్నారని అన్నారు. డాక్టర్ ఉదయ్, డాక్టర్ రిజ్వాన్లు మంచి యూనివర్సిటీలో చదివి మంచి పేరు తెచ్చుకున్న వైద్యులని అన్నారు. అలాంటి వైద్యుల పర్యవేక్షణలో ప్రతి ఒక్క పేషెంట్ కు ట్రీట్మెంట్ అందిస్తున్న మేనేజ్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి నెలలో నాలుగు రోజులు పేదవాళ్లకు ఉపయోగపడే విధంగా ఉచిత క్యాంపులను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ ఉదయ్, డాక్టర్ రిజ్వాన్, డాక్టర్ అమూల్య, మేనేజ్మెంట్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.