హెచ్ఎం వెంకట్ రెడ్డి సేవలు ఎనలేనివి

తెలంగాణ వార్త చిల్లాపురం మార్చి 29 : చిల్లాపురం ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి అందించిన సేవలు ఎనలేనివని ఎంఈఓ బాలునాయక్ అన్నారు వెంకట్ రెడ్డి ఉద్యోగ విరమణ సభ శనివారం పాఠశాల ఆవరణలో జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ సహజమని ఆయన పేర్కొన్నారు పేద విద్యార్థుల అభ్యున్నతిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర మరువలేని అని అన్నారు ఎంతోమంది విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్ది ఉపాధ్యాయ వృత్తికి ప్రధానోపాధ్యాయులు కందుల వెంకట్ రెడ్డి వన్నె తెచ్చారని అన్నారు విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు వెంకట్ రెడ్డి సార్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్లాబ్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి,ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రాజ్, అంబటి శ్రీనివాస్, ఆశలత, గ్రామ పెద్దలు సాతులూరు వెంకటేశ్వర్లు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.