రాజీవ్ గాంధీ ఆలోచనా విధానం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం...!

Aug 20, 2024 - 21:15
 0  19
రాజీవ్ గాంధీ ఆలోచనా విధానం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం...!

* దివంగత ప్రధాని జయంతి లో రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి...!!

పాలేరు ప్రతినిధి/ తెలంగాణ వార్త.... తెలుగు దినపత్రిక ఆగస్టు 20 మంగళవారం

దివంగత ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ నవభారత నిర్మాణానికి ఎన్నో సంస్కరణలు చేశారని, ఆయన ఆలోచనా విధానం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని.. కూసుమంచి లోని ప్రధాన రహదారి వెంట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. 1980 తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసిన గొప్ప నేత అని కొనియాడారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో సరికొత్త పంథాను అవలంబించారని అన్నారు. అణగారిన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసి.. ఆదర్శ పాలన అందించారని తెలిపారు. రాజీవ్ గాంధీ కి జోహార్లు పలుకుతూ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333