ఇందిరమ్మ చీరల పంపిణీ పై అవగాహన

Nov 21, 2025 - 05:46
Nov 21, 2025 - 06:15
 0  203
ఇందిరమ్మ చీరల  పంపిణీ  పై అవగాహన

  తిరుమలగిరి 21 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పథకం కింద మహిళలకు చీరలు పంపిణీ చేయనుంది ఈ సందర్భంగా తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిలకు వివోలకు మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీడీవో లాజర్ మాట్లాడుతూ మహిళలు ఆధార్ కార్డు చూపాలి చీరను తీసుకుంటున్నట్లు ఫోటో దిగాలి మహిళా సంఘాల సభ్యులకు ఆధార్ నెంబర్ తో యాప్ లో ఫోటో తీసుకుని చీరలు పంపిణీ చేస్తారు ఒకవేళ సభ్యులు కాకుంటే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న తర్వాత అందించాలి చీరల పంపిణీ పై రోజువారిగా నివేదికను సమర్పించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏ పిఎం లక్ష్మి , సంఘమిత్ర అధ్యక్షురాలు తాటిపాముల కవిత సంఘమిత్ర వివో లు ఓ వీలు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి