వికలగుల పట్ల పాలకులు వివక్షత వహిస్తే పోరాటం తప్పదు
ఎన్.పి.ఆర్.డి జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్
ముగిసిన వికలాంగుల హక్కుల జాతీయ వేధిక జిల్లా మహాసభలు
మహాసభలో పలు తీర్మాణాలు ఆమోదం
వలిగొండ 31 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి వలిగొండ మండల కేంద్రములోని వికలగుల సమస్యల మహాసభలపై మహాసభలపై పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని,పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మండల కేంద్రంలో రెండవ రోజు జిల్లా అధ్యక్షుడు సురపంగ ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన జిల్లా మూడవ మహాసభలో వికలాంగుల సమస్యల పరిష్కారానికై పోరాట కార్యాచరణలో భాగంగా తీర్మాణాలు ప్రవేశపెట్టడం జరిగింది.ఇ సందర్బంగా ఉపేందర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమైన దేవస్థానం యాదాద్రిలో వికలాంగులకు ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పించాలి.అర్హులైన వికలాంగులకు తిర్కస్కరించిన సదరం సర్టిఫికేట్లు మళ్ళీ ఇవ్వాలి. సర్టిఫికేంట్ వచ్చి ఎదురుచూస్తున్న వారికి ఫించన్ ఇవ్వాలి.వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి.ఉపాదిహామి పనిలో వాకలాంగులకు 200 రోగుల పని కల్పించి కనిస కూలీ 600 రూ.చేయాలి.మహిళలకు ఇంటివద్దే ఉపాది కల్పించేందుకు కుటీర పరిశ్రమలు ఎర్పాటు చేయాలి.ఇల్లు లేని వికలగులకు ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇవ్వాలి.అర్హులైన వికలాంగులకు అన్ని రకాల పరికరాలు ఇవ్వాలి.చదువుతో సంబందం లేకుండా మోటార్ వేయికిల్స్ అందివ్వాలి.ప్రతీ నెల 1నుండి 5వరకు ప్రత్యేకంగా ఫించన్ ఇవ్వాలి.జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రయివేటు విద్యా సంస్థల్లో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి లైన్లలో ప్రత్యేక క్యూలైన్ కల్పించి వైద్యం అందించాలి పెండింగ్ లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలనిలేని పక్షంలో వికలగులను సమీకరించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. మహాసభలకు వివిద మండలాల నుండి హాజరైన వికలాంగులకు దన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్.పి.ఆర్.డి జిల్లా అధ్యక్షుడు సురపంగ ప్రకాష్,జిల్లా కోషాధికారి కొత్తపల్లి లలిత,ఉపాధ్యక్షులు బలుగూరి ఆంజనేయులు,పిట్ట శ్యాంసుందర్,జిల్లా సహాయ కార్యదర్శి తుంగ భూపాల్ రెడ్డి,బర్ల పార్వతి,గిరిక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.