వడ్డేపల్లి మండలం లోని శారద విద్యా నికేతన్ ప్రైవేటు స్కూలు యొక్క గుర్తింపును రద్దు చేయాలి

Nov 20, 2025 - 19:19
 0  11
వడ్డేపల్లి మండలం లోని శారద విద్యా నికేతన్ ప్రైవేటు స్కూలు యొక్క గుర్తింపును రద్దు చేయాలి

విద్యార్థిని మోకాళ్లపై నడిపించిన యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  వడ్డేపల్లి ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ... వడ్డేపల్లి మండల పరిధిలోని శారద విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో కొంకల గ్రామానికి చెందిన రంగన్న కుమారుడిని మోకాళ్లపై నడిపించి మోకాళ్ళ చిప్పలు పగిలిపోయే విధంగా నడిపించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  ప్రైవేటు స్కూల్ యజమాన్యాలు విద్యార్థులను ఫీజుల పేరుతో నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. రోజురోజుకు ప్రైవేటు స్కూల్ ల యొక్క ఆగడాలు ఎక్కువైపోతున్నాయి నాణ్యమైన విద్య అందించే పరిస్థితి లేదు కానీ ఫీజులు మాత్రం వేలలో లక్షల్లో వసూలు చేస్తున్నారు.  పేర్లు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్లు ఫారెన్ స్కూల్ అని పేర్లు పెట్టి ప్రజల యొక్క సొమ్మును దోపిడీ చేసుకొని విద్యను వ్యాపారంగా మార్చుకోవడం దుర్మార్గమని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333