ఇండ్ల మధ్యలో నిలిచిన నీరు దుర్వాసన భరించలేని గ్రామ ప్రజలు 

Sep 19, 2025 - 11:18
Sep 19, 2025 - 11:55
 0  137
ఇండ్ల మధ్యలో నిలిచిన నీరు దుర్వాసన భరించలేని గ్రామ ప్రజలు 

అడ్డగూడూరు 19 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో బస్టాండ్ వద్ద నిలిచిన వర్షపు నీరు వల్ల చానా రోజుల నుండి నీరు నిలవడం వల్ల ఈగలు, దోమలు చేరి దుర్వాసన రావడం జరుగుతుందని గ్రామస్తులు కోరుతున్నారు.ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు చూసుకోవలసిన బాధ్యత గ్రామపంచాయతీపై ఉంటుంది కానీ పెడచెవున పెడుతున్నారు.కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది వర్షాకాలం కారణంగా సీజన్ వ్యాధులతో రోగానికి గురికావడం అవకాశం ఉంటుందని అన్నారు.బ్లీచింగ్ పౌడర్,దోమలకు,క్రిమి కీటకాల మందులు స్ప్రే కూడా బజార్లో,సైడ్ మోరీలో బ్లీచింగ్ పౌడర్ వేయట్లేదని గ్రామస్తులు వాపోతున్నారు.ఇక్కడ చుట్టూ ఇండ్లు పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు స్కూల్ బస్సు కోసం వేచి ఉంటారు.ఇంట్లో ఉండలేని వృద్ధులు గ్రామ ప్రజలు కాయ కష్టం చేసి సేద తీర్చుకోవడానికి ఉదయం నుండి రాత్రి వరకు ఇక్కడే కూర్చుంటారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు నీరు తీసేసి ఈగలు,దోమల నుండి రక్షించాలని చుట్టుపక్కల  ఇండ్ల ప్రజలు గ్రామస్తులు కోరారు.