సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్.

Aug 2, 2024 - 16:52
Aug 2, 2024 - 17:46
 0  33
సుప్రీంకోర్టు  తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్.

నేడు భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నందు

ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ పై

వెలువరించిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన

 కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్...

సూర్యాపేట టౌన్ 2 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- 30 ఏళ్ల నాడు ఒక జాతి తమకు న్యాయంగా పొందాల్సిన హక్కుల వాటా విషయంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఈ సమాజంలో ఎదుర్కొంటున్న అసమానతల, వివక్షలను దాటుకుంటూ తమ జాతిని జాగృతం చేసి ధర్మపోరాటానికి సిద్ధం చేసిన మహానేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడ్డ ఎమ్మార్పీఎస్ రిజర్వేషన్ పోరాట సమితి నేడు ఏ హక్కుల కోసం పోరాడుతుందో అది సమంజసమే అని ఎస్సీ వర్గీకరణలో ఉప కులాలకు తమ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆ కల్పించే హక్కును రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చట్టాలు చేసుకునే విధంగా నేడు సుప్రీంకోర్టు

 వెలువరించిన తీర్పును మాదిగ మరియు ఉపకులాల జాతి భావితరాలకు భవిష్యత్తుకు ఇదొక మైలురాయని సూర్యాపేట 17 వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ తెలిపారు. ఈ తీర్పు పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుతీర్పు కనుగుణంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో, విశ్వవిద్యాలయాల్లో, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ అమలు విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఈ ఉద్యమ ప్రస్థానంలో తన బాల్యం నుంచి చూస్తూ వస్తున్న అనేక సంఘటనలు, పరిస్థితుల్ని నెమరు వేసుకుంటూ

 ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన సబ్బండ వర్గాల పౌర సమాజానికి, రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్యమంలో అమరులైన వీరులను గుర్తు చేసుకుంటూ పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333