సమస్యల వలయంలో గంజిపేట 14 వార్డు

Mar 2, 2026 - 19:34
 0  2
సమస్యల వలయంలో గంజిపేట 14 వార్డు
సమస్యల వలయంలో గంజిపేట 14 వార్డు

 జోగులాంబ గద్వాల 2మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల తక్షణమే కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ ని కోరిన.

     - PDSU గంజిపేట రాజు
   BRS పార్టీ గంజిపేట14 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి.


ఈరోజు ఉదయం గద్వాల పట్టణంలోని గంజిపేట 14వార్డు లో బీఅర్ఎస్ నాయకులు,14వ వార్డు కాంటెస్టెడ్ కౌన్సలర్ PDSU రాజు పర్యటించారు.

 వార్డులో సరైన సీసీ రోడ్లు లేకపోవడం,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల దుర్గంధ వెదజల్లుతోందని,బాత్ రూంలు కూడ లేక అరుబయటకు వెళ్ళాల్సిన దుస్థితి,అలాగే ప్రమాదకరంగా విద్యుత్ బోర్డుల ఏర్పాటు,కనెక్షన్ లు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి.
వార్డులో ప్రధాన సమస్యలు అయిన తాగునీటి సమస్య,వీధి లైట్లా మరమ్మతులు,పారిశుధ్యం,డ్రైనేజీ సమస్యలతో పాటు చాలామంది అర్హులైన వారికి ఇప్పటికి పెన్షన్లు రాలేదని మరి కొందరికి ఉచిత విద్యుత్(గృహలక్ష్మి)పై ఆవగాహన లోపంతో దరఖాస్తు చేసుకోలేదు ఇలా వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని ప్రజలు కంటెస్టెడ్ కౌన్సిలర్ రాజు తో విన్నవించారు..

 గంజిపేట కాలనీలో పారిశుధ్యం ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ ని,మరియు కమిషనర్ కి PDSU రాజు ఫోన్ చేసి మాట్లాడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేయాలి.

 వార్డుల్లో చెత్త తరలింపు ప్రక్రియ రెగ్యులర్‌గా జరగాలని,ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని.

​సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్య ఇన్‌స్పెక్టర్లు నిరంతరం వార్డులను తనిఖీ చేయాలని
మున్సిపల్ చైర్మన్,మరియు మున్సిపల్ కమిషనర్ ని కోరడం జరిగింది.

​ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు యూవత పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333