రైతుల 2లక్ష రుణమాఫీ పట్ల హర్షం వ్వక్తం చేస్తూ...

Jul 18, 2024 - 20:18
 0  2
రైతుల 2లక్ష రుణమాఫీ పట్ల హర్షం వ్వక్తం చేస్తూ...
రైతుల 2లక్ష రుణమాఫీ పట్ల హర్షం వ్వక్తం చేస్తూ...

గద్వాల పట్టణంలో డప్పు డబ్బు చప్పుళ్లతో ఎడ్ల బండ్ల ర్యాలీ చేస్తూ అంబరాన్నింటిన రైతున్నల సంబరాలు

రైతున్నల కోసం రుణమాఫీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం

రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి  :- సరితమ్మ .

సిఎం రేవంత్ రెడ్డి  చిత్రపటాన్నికి పాలాభిషేకం చేసిన

మాజీ జడ్పీ చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్  సరిత తిరుపతయ్య .

మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్

జోగులాంబ గద్వాల 19 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో రైతుల 2లక్ష రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్బంగా హర్షం వ్యక్తం చేస్తూ... సిఎం రేవంత్ రెడ్డి * చిత్రపటాన్నికి ఈరోజు గద్వాల పట్టణం పాతబస్టాండ్ రాజీవ్ సర్కిల్ నందు *మున్సిపల్ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్  అధర్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ జెడ్పి చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ  సరిత తిరుపతయ్య తో పాటు కౌన్సిలర్స్, గద్వాల టౌన్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీనియర్ నాయకులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి  చిత్రపటాన్నికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా 
సరితమ్మ  మాట్లాడుతూ...
రైతు రాజు రైతన్నలందరూ బాగుంటేనే మనందరం బాగుంటామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సోనియాగాంధీ  ఆశీస్సులతో  సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగష్టు 15 నాటికీ రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో రైతులకు ఇచ్చిన హామీ లను నెరవేర్చలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన విధంగానే మొదటి విడతగా 1 లక్ష లోపు రుణమాఫీ కి శ్రీకారం చుట్టారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కీ గద్వాల నియోజకవర్గ ప్రజల తరపున రైతాంగం తరపున వారికీ సరితమ్మ  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్స్,గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు,ఇషాక్,కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు యూత్ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333