ఎన్ డి సి సిబి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Aug 28, 2025 - 21:27
Aug 29, 2025 - 14:49
 0  4
ఎన్ డి సి సిబి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఎన్ డి సి సిబి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మకూర్ నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్ డి సి సి బి నూతనకల్ బ్రాంచ్ మేనేజర్ యాదగిరి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులకు ఎన్ డి సిసిబి ద్వారా రైతులకు అందించే వివిధ రకాల రుణాలు సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తక్కువ వడ్డీతో బంగారం లోన్లు అందిస్తామని దీర్ఘకాలిక రుణాలైనా ట్రాక్టర్ గొర్రెలు మేకల పెంపకం వరి కోత మిషన్ కోలా పెంపకం డైరీ ఫామ్ పెట్టుకోవడంతో పాటు పట్టుపురుగుల పెంపకం తదితర రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తామని రైతులు తమ బ్యాంకులో ఖాతా కలిగి ఉంటే అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన అన్నారు. తమ బ్యాంకు శాఖ ద్వారా మొబైల్ ఎటిఎం ఎవరు అందిస్తున్నామని త్వరలో మరిన్ని గ్రామాలకు మొబైల్ ఎటిఎం సేవలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, సీఈఓ లక్ష్మారెడ్డి రైతులు గిలకత్తుల మల్లయ్య చిత్తలూరు మల్లయ్య గోనిగంటి వెంకట నరసింహం గిలకత్తుల లింగయ్య జంపాల అంజయ్య కోడూరు వెంకన్న జానయ్య సోమయ్య తదితరులు పాల్గొన్నారు.