ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు

డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

Sep 21, 2025 - 19:22
Sep 21, 2025 - 19:45
 0  13
ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు

అడ్డగూడూరు 21 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– 

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ మాట్లాడుతూ..తెలంగాణలోని ఆడపడుచులు పువ్వులను పూజించే గొప్ప అవకాశం మన తెలంగాణలోని ఉందన్నారు.ఈ పండుగ ప్రపంచంలోనే మరెక్కడా లేదు.తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ నుంచి 9వ రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజూ పండుగ రోజే..తీరొక్క పూలతో నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మను పేర్చి.. ఆడబిడ్డలంతా ఓచోట చేరి ఆటపాటలతో ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మండల మరియు గ్రామాల ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.