తెలంగాణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు..

తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండి సుఖశాంతులతో జీవించాలని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలందరికీ ఆయన భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పాడిపంటలతో, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలి అని పండుగలన్నీ ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పుకొచ్చారు. ఈ సంక్రాంతి పండుగతో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అన్నారు. ప్రజలంతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలన్నారు. ప్రధానంగా ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగురవేసే ప్రతి ఒకరు జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని సూచించారు.