ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం టు పథకంలో భాగంగా

ఏపీ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం గారు"ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ తాతయ్య

Nov 1, 2024 - 16:41
Nov 1, 2024 - 18:01
 0  17
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం టు పథకంలో భాగంగా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం 2 పథకంలో భాగంగా దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్ గారు, శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.* 

_*ఏపీలో సూపర్‌-6 హామీల అమలులో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీపం-2 పథకంగా వ్యవహరిస్తున్న ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి తొలివిడతగా జగ్గయ్యపేట పట్టణం చిల్లకల్లు రోడ్డులో గల HP గ్యాస్ కంపెనీ వద్ద ఉచిత గ్యాస్‌ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లను నెట్టెం శ్రీ రఘురామ్ గారు, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు అందజేశారు.

ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ._పేద ప్రజలకు కొండంత అండగా, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా అన్న ఎన్టీఆర్ గారు నిలిస్తే ఆయన బాటలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ ని పేదరికం లేని రాష్ట్రంగా నిలిపేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు అన్నారు._

పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం సంక్షేమానికి, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తోందన్నారు._

_మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలు, మహిళల పేరుమీద ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణం, భూమి కొనుగోలు వంటి ఎన్నో పథకాలు ఆచరణాత్మకంగా అమలు చేసి చూపించారన్నారు.

_మహిళా శక్తిని మహాశక్తిగా చేయాలని, పేదవారిని ధనికులుగా చేయాలనే దృఢ సంకల్పంతో 2024 ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు._ 

_అధికారం చేపట్టగానే ఒక్కో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది._

_ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అన్నారు._

_కట్టెల పొయ్యితో తన తల్లి పడ్డ కష్టం మరే మహిళకు రాకూడదని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు 'దీపం' పథకం ప్రవేశ పెట్టి 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారన్నారు._

_నేడు వంటింటిపై భారం తగ్గించడంలో ముందడుగుగా మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారన్నారు._

_మూడు ఉచిత సిలిండర్లు పంపిణీతో పేద ప్రజల ఇళ్లల్లో అసలయిన దీపావళి వెలుగులు నింపబోతున్నారు.

_పేదల జీవన ప్రామాణాలు పెంచడమే కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు._

_ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా, ఎక్కడా ఇబ్బంది లేకుండా పగడ్బందీగా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు రూపొందించిందన్నారు._

_అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్ల పథకం అమల్లోకి తెస్తున్నారన్నారు._

_ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ను పూర్తి ఉచితంగా పొందవచ్చునన్నారు._

_గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన 48 గంటల్లో డి.బి.టి. ద్వారా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా జమ అవుతుంది అని అన్నారు._

_ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92 గా ఉండగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లతో ఒక్కో కుటుంబానికి రూ.2684 లబ్ది జరుగుతుందన్నారు._ 

_రాష్ట్రంలోని 1కోటి 47 లక్షల తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. ఇందుకు గాను రూ.2684 కోట్ల ఆర్ధిక భారం కూటమి ప్రభుత్వం భరించనుంది అని అన్నారు._

_ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయడం మహిళా సంక్షేమం, గౌరవం, భద్రత, ఎదుగుదల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ని తెలియచేస్తుంది అని అన్నారు._

_ఈ కార్యక్రమంలో రంగాపురం రాఘవేంద్రరావు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కొఠారు సత్యనారాయణ ప్రసాద్, నూకల కుమార్ రాజా, మేక వెంకటేశ్వర్లు, మైనేని రాధాకృష్ణ, కట్టా వెంకట నరసింహారావు, గింజుపల్లి రమేష్, కానూరి కిషోర్, గడ్డం హుస్సేన్, ధూళిపాళ్ల లక్ష్మణరావు, కన్నెబోయిన రామలక్ష్మి, గొట్టే నాగరాజు, నకిరకంటి వెంకట్, పూసల పుల్లారావు,దువ్వాల రామకృష్ణ,మీసాల చిట్టిబాబు, నోముల రఘు, కాకులపాటి కృష్ణమోహన్, నూకల బాలకృష్ణ, ప్రకాష్, కళ్యాణం సూర్యప్రకాశ్, చిలుకూరి కార్తీక్, పసుమర్తి మహేష్, నాయిని రజిని, పితాని శ్రీనాథ్ మరియు జనసేన నాయకులు షౌకత్ అలీ, ఈమని కిషోర్, మోసిన్ మరియు కూటమీ నాయకులు తదితరులు పాల్గొన్నారు._

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State