అవ్వతో పాటు కింద కూర్చున్న కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీo భూపాలపల్లి

Oct 24, 2025 - 12:50
 0  1
అవ్వతో పాటు కింద కూర్చున్న కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీo భూపాలపల్లి

భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటన పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఆ పెద్దమ్మ చివరి ప్రయత్నంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది.కానీ కార్యాలయంలో కలెక్టర్ లేరని సిబ్బంది చెప్పారు.చేసేదేంలేక నిరాశతో అక్కడే కూర్చుండిపోయింది..!ఇంతలో సూటు,బూటు వేసుకున్న ఓ వ్యక్తి ఆ వృద్ధురాలు వద్దకు వచ్చాడు.ఏం పెద్దమ్మా..ఏం కావాలి అని ఆరా తీశాడు.దానికి ఆ వృద్ధురాలు బదులిస్తూ..రెండేండ్ల సుంది పింఛన్ వస్తలేదు బిడ్డా..సారును కలుద్దామని వచ్చినా అంది.ఆమెతో పాటు మెట్లపై కూర్చొని ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆ వ్యక్తి కలెక్టర్ సార్..సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్య పరిష్కరించాడు.అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్.ఆ పెద్దమ్మతో మాట్లాడి సమస్య పరిష్కరించిన ఆ వ్యక్తి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం.తనతో మాట్లాడుతున్న వ్యక్తి కలెక్టర్ అని ఆ పెద్దమ్మకు తెలియదు.తానేవరో ఆయన కూడా చెప్పలేదు.పెద్దమ్మ సమస్యను మాత్రం క్షణాల్లో పరిష్కరించారు.తనకు ఎంతో ఆప్తుడైన వ్యక్తి వద్ద కష్టం చెప్పుకున్నట్లు ఆమె గోడు వెళ్లబోసుకోగా..ఎంతో ఓపికగా ఆయన సమస్య గురించి విన్నారు.చివరికి ఆయనే కలెక్టర్ అని తెలియడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది.కలెక్టర్ నిరాడంబరత్వానికి ఆమె విస్తుపోయింది.మెట్లపై కూర్చొని వృద్ధురాలితో ముచ్చటిస్తున్న కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీంకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కలెక్టర్ పనితీరుపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు అజ్మీర మంగమ్మ(70)కేసీఆర్ సర్కార్ అందిస్తున్న పింఛన్ కోసం గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపింది.చివరికి చేసేదేంలేక బుధవారం(ఫిబ్రవరి 26) కలెక్టర్ ఆఫీసుకు వచ్చి మెట్లపై కూర్చుంది.అయితే ఆ సమయంలో అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు.కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం ఆ కార్యాక్రమంలో పాల్గొన్నారు.మంత్రి కార్యక్రమంతో బిజీబిజీగా ఉన్న కలెక్టర్ అజీం..తన కార్యాలయానికి వస్తూనే మెట్లపై కూర్చొని ఉన్న వృద్ధురాలిని గమనించారు.వెంటనే ఆమె సమస్య గురించి ఆరా తీశారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్లో మాట్లాడి ఆమెకు పింఛన్ మంజూరు చేయించాల్సిందిగా అని ఆదేశించారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333