హెల్త్ సబ్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 24 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలో మాలిపురం,గుండెపురి గ్రామాల్లో గురువారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆరోగ్య ఉపకేంద్ర భవనాలకు శంకుస్థాపన నిర్వహించారు. ఒక్కో ఆరోగ్య ఉప కేంద్ర భవనానికి 20 లక్షల చొప్పున నిధులతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా విద్యా,వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సకాలంలో ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోకి తేవాలని అధికారులను,కాంట్రాక్టర్ని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మరిన్ని అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. గుండెపూరి నుండి కాశి తండా,పస్తాల రోడ్లకు నిధులు మంజూరయ్యాయని ఇటీవల టెండర్లు అయినట్లు పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో లాజర్,తహాశీల్దార్ హరిప్రసాద్,మండల వైద్యాధికారి మల్లెల వందన,ఆరోగ్య సిబ్బంది తోపాటు డిఈ ఏ ఈ కాంట్రాక్టర్ మరియు పార్టీ మండల అధ్యక్షుడు వై నరేష్, సుంకర జనార్ధన్ జుమ్మీ లాల్ నాయక్, కందుకూరి లక్ష్మయ్య దానియల్, సుధాకర్,కొమ్ము సోమన్న,బాలకృష్ణ, శ్రీనివాస్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.