ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన  అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

Jul 10, 2024 - 19:14
 0  2
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన  అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన  అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

జోగులాంబ గద్వాల 11 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల నిన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని,అలంపూర్  అభివృద్ధి గురించి వినతి పత్రం ముఖ్యమంత్రి కి అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే  విజయుడు . ముఖ్యమంత్రి  దీనికి సానుకూలంగా స్పందించి చేద్దాం అని గట్టి హామీ ఇవ్వడం జరిగింది._

1)వ్యవసాయం :-) అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న RDS కెనాల్ కు పూర్తీ స్థాయిలో సాగునీరు అందించుటకు అవసరమైన మల్లమ్మకుంట రిజర్వాయరు, జులికల్ రిజర్వాయరు మరియు వల్లూరు రిజర్వాయరు వెంటనే నిర్మాణం చేపట్టాలి.

2)జవహర్ నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు కొరకు ఇటిక్యాల మండలం, వడ్డేపల్లి మండలం మరియు అయిజ మండలం లకు సుమారు 32000 ఎకరాలు కొత్తగా ఆయకట్టు వస్తుంది . ఇది 99 మరియు 100 ప్యాకేజి కింద పెండింగ్ లో ఉన్నది .ఈ యొక్క ప్యాకేజీ పనులు పూర్తీ చేయండి. గత కాంగ్రెస్ ప్రభత్వం లో దివంగత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి హయాములో ప్రారంభమై నేటికీ పూర్తీ కాలేదు.

3) RDS కెనాల్ డిస్ట్రిబ్యూటర్ 12 నుండి 24 వరకు సాగునీరు పూర్తీ స్థాయిలో అందించుటకు, చిన్నోనిపల్లి రిజర్వాయరు నుండి RDS కెనాల్ కు డిస్ట్రిబ్యూటర్ 12 వరకు లింక్ ఛానల్ ద్వారా కర్నటక నుండి సాగునీరు సకాలంలో రాకున్న ఈ లింక్ ఛానల్ ద్వారా ఏర్పాటు సాగునీరు అందిచవచ్చు.

4)రహదారులు :- అలంపూర్ నియోజక వర్గంలో రహదారులు మరియు భవనములు శాఖ ద్వారా అన్ని రహదారులు పూర్తీ స్థాయిలో రోడ్స్ కంప్లీట్ చేయాలి మరియు పంచాయతీ రోడ్స్ కూడా పూర్తీ చేయాలి.

5) వైద్యం :- అలంపూర్ నియోజకవర్గం లో అలంపూర్ ఎక్స్ రోడ్ లో నిర్మాణం పూర్తీ ఐన 100 పడకల ఆసుపత్రి కి అన్ని పోస్టులు మంజూరు చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలి మరియు కర్నూలో నగరంలో మన తెలంగాణ ఆరోగ్య శ్రీ సేవలు మన జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజలకు,ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు కల్పించాలి.

6)ప్రజలకు రవాణా సౌకర్యం :- అలంపూర్ ఎక్స్ రోడ్ లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కలిపించాలి మా నియోజకవర్గ లోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం బస్సు లేనందువల్ల ఈ సౌకర్యం పొందలేక పోతున్నారు.

7) అలంపూర్ నియోజకవర్గంలో మహిళల రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ భవనాలు నిర్మించాలని.ఇలా పాలు... అంశాలు ముఖ్యమంత్రి  కి వినతిపత్రంలో అందజేయడం జరిగిందని అలంపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వారు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333