కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం వర్ధంతి
జోగులాంబ గద్వాల 22 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మౌలానా అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా గద్వాల్ లో రాజీవ్ రోడ్డు మీద ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగినది.కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ...మౌలానా అబ్దుల్ కలాం భారత దేశ మొదటి విద్యా శాఖ మంత్రి ఆలాగే స్వతంత్ర ఉద్యమంలో చెరుకుగా పాల్గొని స్వతంత్ర పోరాట వీరుడుగా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం ఆజాద్. భారతదేశంలో విద్య ముందు తరాలకి కూడా ఎంతో అవసరంగా ఉండాలని ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎన్నో మార్పులు చేశారు దానివల్లనే భారత దేశంలో ఎంతోమంది మేధావులు శాస్త్రవేత్తలు ఇలా ఎన్నో రంగాలలో భారతదేశ ముందు ఉండడానికి అబ్దుల్ కలాం ఆజాద్ విద్య మీద పెట్టిన దృష్టి. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఘనకీర్తులు సంపాదించిన వ్యక్తులలో అబ్దుల్ కలాం ఆజాద్ ముందు వరుసలో ఉంటారు అని చెప్పడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గద్వాల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యూసుఫ్,కౌన్సిలర్ డిటిడిసి నరసింహ, మాజీ కౌన్సిలర్ నాగేందర్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మరియు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్, హఫీజ్, కౌసర్ బెగ్, జాంగీర్,ఇమనియల్, రాము యాదవ్, కుంట రవి, మలిం మదిని, రామ్ నగర్ మోహన్, నారాయణ, షఫీ, కొత్తపల్లి అక్బర్, హర్కర్ మహెల సమి, అప్సర, కిగాయత్, మోయిన్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.