మానవత్వం పరిమళించిన వేళ
దిక్కు మొక్కు లేని ఒక అనాధను ఆదుకున్న సమాజ సేవకుడు కడాలి నాగరాజు.
భద్రాచలం, 8 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులోని విగతజీవిగా పడి ఉన్న ఒక పెద్దావిడను గుర్తించి అటుగా వెళుతున్న వారు చూసి సమాజ సేవకుడు కడా లినాగరాజు కి తెలియజేసినారు, వెను వెంటనే స్పందించి అక్కడికి వచ్చి చూసేసరికి ఆవిడ చుట్టూ ఈగల ముసురుకుంటూ ఉన్నాయి
అలా చూసిన వెంటనే నాగరాజు ఆవిడని లేపి కూర్చోబెట్టి అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరేంటి అని అడిగితే ఆమె నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు కూర్చొ లేని పరిస్థితిలో ఉన్నది వెంటనే పక్కన ఉన్నటువంటి బల్ల సహాయంతో కూర్చోబెట్టి భోజనం పెట్టించి ఒక చీర తీసుకొచ్చి ఆమెకు చుట్టి అటుగా వెళుతున్న ఒక మనిషి సహాయంతో ఆటోలో ఎక్కించి భద్రాచలం కూనవరం రోడ్డులో ఉన్నటువంటి సరోజినీ వృద్ధాశ్రమానికి తీసుకువెళ్లి సరోజనమ్మకి ఆవిడని అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చినాడు.