అయోధ్య సీతారామునిగా భక్తులకు దర్శనం ఇస్తున్న భద్రాద్రి రాముడు. 

Dec 26, 2025 - 18:53
 0  31
అయోధ్య సీతారామునిగా భక్తులకు దర్శనం ఇస్తున్న భద్రాద్రి రాముడు. 

తెలంగాణ వార్త  డిసెంబర్ 26 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : ముక్కోటి ఏకాదశి ఉత్స వాలు, దశావతార మహోత్సవాల సందర్భంగా7 వ రోజు శుక్రవారం అయోధ్య సీతారామునిగా భక్తులకు దర్శనం ఇచ్చారు భద్రాద్రి సీతారాములు. అరణ్యవాస సమయంలో దండకారణ్య ప్రాంతమైన భద్రాద్రి గోదావరి నది తీర ప్రాంతంలో పర్యటించారు సీతా రామలక్ష్మణులు. ఆ సమయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం  దండకారణ్య ప్రాంత మైన భద్రాద్రిలో మహోన్నత రామ భక్తుడైన భద్ర మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ ప్రాంతా నికి భద్రాద్రి, భద్రగిరి, కాలక్రమేణా భద్రాచలం గా ప్రసిద్ధి చెందినది. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు తన భరతఖండ పర్యటనలో భద్రాచలం ప్రాంతంలో కూడా పర్యటించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.  వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే,చక్రం చోర్ధ్వకరేణ బాహు యుగలే, శంఖం శరం దక్షిణే, బిబ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్తి స్థితం, కేయూరాది విభూషితం  రఘు పతిమ్.సౌమిత్రి యుక్తం భజే అంటూ భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామివారిని పూజించారు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారు. అటు పిమ్మట పోకల దమ్మక్క, భక్త రామదాసు, కబీర్దాస్ మొదలగు భక్తుల ద్వారా భద్రాచలంలో మహోన్నత రామాలయం నిర్మాణం కావడం జగమెరిగిన సత్యమే. ఇటువంటి మహోన్నతమైన భద్రాచలం దివ్య క్షేత్రంలో ప్రతి ఏటా జరుగుతున్న వైకుంఠ ఏకాదశి, దశావతార ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీరామావతారంలో భద్రాద్రి రాముని దర్శించుకున్న భక్తులు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని శ్రీరాముని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై జై భద్రాచలం సీతా రామ్ అంటూ పెద్ద పెట్టున స్వామివారిని ప్రార్థించారు. 
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333