ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ కాక ఇందిరమ్మ ఇళ్ల బాధితులు లబోదిబో

Dec 23, 2024 - 17:58
 0  1
ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ కాక ఇందిరమ్మ ఇళ్ల బాధితులు లబోదిబో

జోగులాంబ గద్వాల 21 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమం ప్రవేశపెట్టి ఇళ్ళు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకున్న అనంతరం వారి దరఖాస్తులు ఆన్లైన్ కాక బాధితులు లబోదిబోమంటున్నారు. గద్వాల పట్టణంలోని అనేక వార్డులలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేసిన వారికి మాత్రమే ఫోన్ చేస్తూ వారి వివరాలు సేకరిస్తున్నారు. మరి ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు గురించి అర్జీ చేసిన వారి పేర్లను ఆన్లైన్ కాని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో వార్డులో వందమంది వరకు ఆన్లైన్ కాలేదని తెలిసింది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం గురించి అర్జీ చేసిన వారి పేర్లు ఆన్లైన్ కానీ వాటిని ఆన్లైన్లో ఫీడ్ చేసి వారికి ఇందిరమ్మ ఇల్లు లబ్ధి చేకూరేటట్లు అధికారులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333