షార్ట్ సర్క్యూట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బీఎస్పీ నాయకులు బొడ్డు కిరణ్

Dec 26, 2025 - 18:51
 0  11
షార్ట్ సర్క్యూట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బీఎస్పీ నాయకులు బొడ్డు కిరణ్

శాలిగౌరారం 25 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని ఆకారం గ్రామంలో గురువారం రోజు తెల్లవారుజామున కరెంట్ షార్ట్ సర్క్యూట్ మసీద్ పక్కన కిరాయికి ఉంటున్న ఇంద్రకంటి శ్రీ కన్య- యాదగిరి గృహంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో సుమారుగా 30 వేల రూపాయల డబ్బులు రెండున్నర తులాల బంగారం వస్తు రూపంలో 25,వేలు నష్టం జరిగింది.ఈ ప్రమాదం పై తక్షణమే బిఎస్పి తరఫున స్పందించి ఎమ్మార్వోతో తోమాట్లాడి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఒక రిపోర్ట్ ను కూడా పంపించడం జరిగింది. అందుకు ఎమ్మార్వో సానుకూలంగా స్పందించారు.కావున ప్రజలు షార్ట్ సర్క్యూట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బీఎస్పీ నాయకులు బొడ్డు కిరణ్ గ్రామస్తులకు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333