మంత్రి జూపల్లి మనిషింటా
జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. మండల కేంద్రం బీచుపల్లి పదవ బెటాలియన్ పోలీస్ పెట్రోల్ బంక్ లో ఓ రాజకీయ నాయకుడు లోకేశ్వర్ రెడ్డి మేము జూపల్లి కృష్ణారావు మనుషులం అంటూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోరా... కొల్లాపూర్ నియోజకవర్గం అని అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో మర్యాద లేకుండా మాట్లాడుతూ దౌర్జన్యానికి దిగ్గాడు. మంత్రి జూపల్లి మనుషులయితే ఉన్నతమైన పోలీస్ వ్యవస్థ ఆధ్వర్యంలో నడిపించే పెట్రోల్ బంకులోనే ఈ విధంగా దౌర్జన్యాలు దిగి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా . ఇలాంటి చోటా మోటా నాయకుల వల్లే మంత్రుల విలువ పడిపోతుంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి పోలీసు వారు మరియు అక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు.