Telangana SSC Results 2024: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.

Apr 29, 2024 - 18:41
 0  3
Telangana SSC Results 2024: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.

పరీక్ష పత్రాల మూల్యాంకనం, కంప్యూటీకరణ కూడా పూర్తవడంతో ఫలితాలను చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు.

మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా టెన్త్ క్లాస్ ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,7,952 మంది బాలురు కాగా, 2,50, 433 మంది బాలికలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షా పత్రాల మూల్యాకనం 19 కేంద్రాల్లో నిర్వహించారు. అనంతరం కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్‌ను https://results.cgg.gov.in వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. విద్యార్థల హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే.. స్క్రీన్‌పై రిజల్ట్స్‌ ప్రత్యక్షం అవుతాయి. ఫలితాలతో పాటు మార్కుల మెమో కూడా ఉంటుంది. గతేడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగియగా.. రిజల్ట్స్ మే 10వ తేదీన విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 రోజులు ముందే పరీక్షలు పూర్తయ్యాయి. 

ఇప్పటికే ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఏపీ పది పరీక్షల్లో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 84.32 శాతం, బాలికలు 89.17 శాతం మంది పాస్ అయ్యారు. పార్వతీపురంమన్యం జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం 96.37 కాగా.. కర్నూలు జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం 62.47 నమోదైంది. ఏపీలో మే 24 నుంచి జూన్ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 2,803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 17 పాఠశాలలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333