వడ్ల కొనుగోలు కేంద్రాలలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్

May 5, 2025 - 19:07
 0  9
వడ్ల కొనుగోలు కేంద్రాలలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

40 కేజీల బస్తాకు అదనంగా 700 గ్రాముల తరుగు.

చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి.

జోగులాంబ గద్వాల ఐదు మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల పైన కఠినమైన చర్యలు తీసుకొని, అదనంగా తీసుకున్న వడ్లను రికవరీ చేయాలని ఈరోజు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ కి వినతిపత్రాన్ని రైతులతో కలిసి ఇచ్చిన బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ...

* జిల్లాలోని ఉన్నటువంటి 69 వడ్ల కొనుగోలు కేంద్రాలలో భారీ అవకతవకలు జరుగుతున్నాయి.

* కాంగ్రెస్ నాయకులు రైతులను నిట్ట నిలువుగా ముంచుతూ రైతుల దగ్గర బస్తాకు 700 గ్రాములు అదనంగా తీసుకుంటున్నారు. 

* అనగా క్వింటాంకు 2 KG ల వడ్లు అదనంగా తీసుకొని, ఆ తీసుకున్న వడ్లను బినామీల పేర్ల మీద నమోదు చేసి డబ్బులు దండుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సర్కార్.

* మొన్న అనగా 3/05/2025 శనివారం నాడు ఐజ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి విజిట్ చేసాము. అక్కడ ఈదే పరిస్థితి ఉంది అని కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.

* రైతులను పీల్చి పిప్పి చేస్తున్న కొనుగోలు కేంద్రాల అధికారులు కాంగ్రెస్ నాయకులు.

* బస్తాకు 40 kg + బస్తా బరువు క్వాంట పట్టాలని చాలా క్లియర్ గా నిబంధనలు చెప్తా ఉంటే 

* ఇక్కడున్న అధికారులు కాంగ్రెస్ నాయకులకు వంతపడుతూ బస్తాకు 41.3 kg ల వడ్లను తీసుకోవడం దుర్మార్గం.

* మేము కాళీ బస్తాను తూకమేసి చూస్తే 580  గ్రాములు ఉంది. అంటే ఈ లెక్కన బస్తాకు 700 గ్రాముల వడ్లను అదనంగా తీసుకోవడం దుర్మార్గం.

* జిల్లాలోని అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.

* తక్షణమే సెంటర్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

* రైతులు ఎక్కువ ఎందుకు తీసుకుంటారని ప్రశ్నిస్తే రైతుల పైన తిరగబడి మీకు గన్ని బ్యాగులు ఇవ్వము మరియు మీ వడ్లు కాంటా పట్టమని రైతులను బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులు.

* రైతులకు టార్పాలిన్ కవర్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసి ముద్ద అయ్యే పరిస్థితి ఉంది వెంటనే వచ్చినదానాన్ని వచ్చినట్టు కాంటా వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు 

* సామాన్య రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులు కాంగ్రెస్ నాయకులు.

* తక్షణమే జిల్లా కలెక్టర్ వీటిపైన ఎంక్వయిరీ చేసి అదనంగా తీసుకున్న వడ్లను రికవరీ చేసి అధికారుల పైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని వినతిపత్రం ను ఇచ్చి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు  కలుగోట్ల మధు, టవర్ మక్బుల్, గాజుల కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి మరియు రైతులు లక్ష్మన్న తేజ తిమ్మప్ప నరసింహులు నాగరాజు, జయన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333