రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి.

Sep 30, 2024 - 19:38
 0  13
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి.

జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లాలోని రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలోని డీలర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.క్వింటాల్ కు 300 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో డీలర్లకు గౌరవేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చింది వెంటనే అమలు చేయాలని వారు కోరారు.ప్రతి డీలర్ కు 10 లక్షల ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఇవ్వాలని, దిగుమతి హమాలి ప్రభుత్వమే  భరించాలని, ఒక శాతం తరుగు ఇవ్వాలని,ఈపాస్ నుంచి ప్రతినెల తొలగించాలన్నారు.డీలర్ చనిపోతే దాన సంస్కరణ కోసం దహన సంస్కరణ కోసం 50,000 చెల్లించాలి, తాత్కాలిక,డ్వాక్రా గ్రూపు ఉన్న కుటుంబాలకు రేషన్ దుకాణాలు పర్మినెంట్ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్సీ పాయింట్లు వే బ్రిడ్జిలు ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ నిర్మించాలి, నాణ్యమైన నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు నిసార్ పాషా, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి,ఆయా మండలాల అధ్యక్ష ఖదీర్,సురేష్ బాబు,రాముడు, ఉదయ్ కాంత్,రాజు,కృష్ణ, రామాంజనేయులు,వెంకటేష్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333