విద్యార్థులు శాస్త్ర దృక్పథాన్ని పెంపొందించుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలి డాక్టర్ రాజు

Feb 28, 2025 - 19:05
 0  3
విద్యార్థులు శాస్త్ర దృక్పథాన్ని పెంపొందించుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలి డాక్టర్ రాజు

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి 28 : మిర్యాలగూడలో విద్యార్థుల్లో సరైన మౌలిక వస్తు లేక రానురాను శాస్త్ర దృక్పథం లోపిస్తుందని సరైన శాస్త్రీయత అలవర్చుకొని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగినప్పుడే భారతదేశం మరింత అభివృద్ధి చెందగలదని సామాజికవేత్త డాక్టర్ రాజు అన్నారు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్సు దినోత్సవము పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక స్థానిక మిర్యాలగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విజయ కుమారి, అధ్యక్షతన ఏర్పాటు చేసిన సైన్స్ డే ఉత్సవాలలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య ,మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో విద్యపై ఎక్కువగా ఖర్చు పెడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటుంటే సాంప్రదాయాల పేరుతో నానాటికీ మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయని మూఢ విశ్వాసాలు నిర్మూలించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సమూహ రిటర్న్స్ ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ పాఠశాలలో పరిశోధన శాల లను నిర్మించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసినప్పుడే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. తదనంతరం జన విజ్ఞాన వేదిక నిర్వహించిన జీవ పరిణామం మనిషి పుట్టుక అనే వ్యాసరచనలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో ప్రశంస పత్రాలు అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్స్ తయారు చేసి ప్రదర్శించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు జె కొండల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, చీదెళ్ల యాదయ్య, సాంస్కృతిక సారధి కళాకారులు ఆర్ వి ప్రతాప్, సలాకర్, పాఠశాల టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333