తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్కరూ. ఏఐసీసీ కి ఎంపిక
జోగులాంబ గద్వాల 30 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐసీసీ కి ఎంపిక కాబడిన ఒకే ఒక వ్యక్తి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ యింతకు ముందు ఏఐసీసీ కార్యదర్శి గా మహారాష్ట్ర ఇన్చార్జి గా పనిచేసిన సంపత్ కుమార్ . ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ ముఖ్య సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే , మహారాష్ట్ర ఇన్చార్జ్ గా ఉన్నటువంటి డా.SA.సంపత్ కుమార్ ని ఈరోజు ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఛత్తీస్గడ్ రాష్ట్రానికి ఇన్చార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా నియమించారు . ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుది అని దానికి యిది ఒక ఉదాహరణ అని అన్నారు .
చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి విశ్వాసం తో ఉన్నానని దానిని కేంద్ర నాయకత్వం గుర్తించిందని అన్నారు . నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర నాయకత్వానికి తల్లి సోనియా గాంధీ కి ,ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కి, రాహుల్ గాంధీ కి ,KC వేణుగోపాల్ కి, మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి తనవంతు పాత్ర పోషిస్తానని అన్నారు. బిజెపి చేస్తున్నటువంటి అరాచకకు పాలనను ఎక్కడికి అక్కడ ,ఎప్పటికప్పుడు ఎండగడతానని తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజా పాలన చాలా అద్భుతంగా కొనసాగుతుందని రాబోయే 10 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు . తెలంగాణ రాష్ట్రం లో కూడా మంచి గౌరవం దక్కబోతుంది అని ధీమా వ్యక్తం చేసారు.కాంగ్రెస్ పార్టీ నాకు కన్నా తల్లి లాంటిది అని సోనియమ్మ ఆశీస్సులతో తెలంగాణ లో కూడా గౌరవప్రదమైన. పదవి దక్కబోతోంది అని తెలిపారు .
త్వరలోనే ఢిల్లీ నాయకుల్ని కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తానని అన్నారు .