నాణ్యమైన భోజనం అందించాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ నాణ్యమైన భోజనం అందించాలి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం అందించాలని సెక్టోరియల్ అధికారి వై రాంబాబు అన్నారు. గురువారం మండల పరిధిలోని కోట పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేయాలని నాణ్యమైన వస్తువులు వాడాలని అన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు డ్రస్సులను అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవం గల ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య అందుతుందని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల మోజులో పడి ఆర్థికంగా చితికిపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిష్టయ్య ఉపాధ్యాయులు పుల్లయ్య రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.