ఇండ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారంకు రక్షణగోడ ఏర్పాటు చేయాలి!
అడ్డగూడూరు24అక్టోబర్2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని కురుమ సంఘం భవనం ముందు ఉన్న ట్రాన్స్ఫారంకు ముందు జాగ్రత్తగా రక్షణ కవచంగా ప్రహరీ గోడును ఏర్పాటు చేయాలి ట్రాన్స్ఫారం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించలని స్థానికలు కోరుతున్నారు.అప్పుడంటే సింగిల్ రోడ్డు విద్యుత్ ట్రాన్స్ఫారం దూరంగా ఉంది.మండలం ఏర్పడ్డ కానుండి రోడ్డు వెడల్పు కావడంతో టీ ఆకారంలో ఉన్న రోడ్డుకు జనాలు ఎక్కువగా సంచరిస్తుంటారు.వృద్ధులు చిన్నపిల్లలు అవసరాల కొరకు తిరుగుతుంటారు.నోరులేని మూగజీవాలు గేదెలు,పశువులు, గొర్లు కోవచ్చు..అక్కడ నుండి మేతకు ఎక్కువ వెళ్తుంటాయి.ఇండ్ల మధ్యలో ఉన్నందున ఎవరికి ఏ ప్రమాదం ఎవరికి సంభవిస్తుందని భయం..ప్రాణం గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది.ప్రాణాలు కోల్పోయిన తర్వాత చేసేది ఏమి ఉండదు. పోయిన ప్రాణం తిరిగి రాదు..కాబట్టి ట్రాన్స్ఫారం బాధ్యతలు చేపట్టేది ఎవరు? విద్యుత్ అధికారుల? గ్రామపంచాయతీనా?లేక చుట్టుపక్కల ఇండ్ల వాళ్ల?ఎవరో ఒకరు కానీ ప్రమాదాలు పొంచి రాక ముందే ట్రాన్స్ఫారం చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని విద్యుత్ అధికారులు చొరవతీసుకొని పగడ్బందీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు,స్థానికులు కోరుతున్నారు.