రాష్ట్ర 4వ మహాసభల జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా అధ్యక్షుడు స్వరూపంగా ప్రకాష్
భువనగిరి 24 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి) రాష్ట్ర నాలుగో మహాసభల సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచికగా భువనగిరి పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుండి 26 వరకు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది.ఈ మహాసభకు వికలాంగులు అధిక సంఖ్యలో రావాలని పిలుపునివ్వడం జరిగింది.వికలాంగుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది ఆయన గుర్తు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి,జిల్లా కోశాధికారి కొత్త లలిత,మండల నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.