అడ్డగూడూరు ప్రభుత్వ దవఖానలో ప్రత్యేక వైద్య శిబిరం డాక్టర్"బి భార్గవి

అడ్డగూడూరు 18 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్"బి భార్గవి ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహించారు.చర్మ,దంత,మానసిక వైద్య నిపుణులు రోగులకు పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు.పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి సేవలు పొందారు.మెడికల్ ఆఫీసర్ డాక్టర్"భార్గవి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించడమే మా లక్ష్యం అని అన్నారు.ఈనెల 25న ముక్కు,చెవి,గొంతు (ఇ.ఎన్.టి),కంటి, గైనకాలజీ నిపుణులు రానున్నారు.ఆ రోజు కూడా ప్రత్యేక శిబిరం నిర్వహించి ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తాం”అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు,ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.రాబోయే శిబిరం కోసం వివిధ గ్రామాల అనారోగ్యలు ముందుగానే పేరు నమోదు చేసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.