సైబర్ బాధితులకు అండగా సైబర్ వారియర్స్ ఉంటూ సైబర్ నేరాల పై ప్రజలను చైతన్యం చెయ్యాలి
సైబర్ వారియర్స్ సమావేశంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు
జోగులాంబ గద్వాల 23 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: సైబర్ నేరాలకు గురైన బాధితులకు అండగా ఉంటూ కొత్త కొత్త టెక్నిక్స్ తో జరుగుతున్న సైబర్ నేరాల పై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చెయ్యాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు సైబర్ వారియర్స్ కు సూచించారు.ఆయా పోలీస్ స్టేషన్ల వారిగా నియమించిన సైబర్ వారియర్స్ తో ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం లో సమావేశమై జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలు, ప్రజలు మోసపోతున్నా తీరు, నమోదైన కేసులలో ఫ్రీజ్ అయిన అమౌంటు, పోగొట్టుకున్నా అమౌంట్ బాధితులకు తిరిగి అందజేసేందుకు తీసుకుంటున్న చర్యలపై వారిని అడిగే తెలుసుకొని వారికి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలకు గురి కాకుండా చైతన్యం చెయ్యాలని,ఒక వేల నేరాలకు గురైతే సైబర్ నేరానికి గురైన బాధితులకు అండగా ఉండాలని తెలియజేశారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 ఫోన్ నెంబర్కు గాని,(www.cybercrime.gov.in) ఎన్సిఆర్బి పోర్టల్ లో గాని, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ గాని సంప్రదించే టట్లు అవగాహాన కల్పించాలని అన్నారు. ప్రజలు సైబర్ నేరం ద్వారా మోసపోయిన డబ్బును త్వరగా ఇప్పించే విధంగా ఏలాంటి చర్యలు చేపట్టలో తెలియజేశారు. పూర్తి అవగాహనతో కోర్టు ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఇదివరకే సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే సైబర్ వారియర్స్ వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చెయ్యాలని తెలియజేశారు.సైబర్ నేరాలకు సంబంధించి వచ్చిన ప్రతి ఫిర్యాదు పై కేసు నమోదు చెయ్యాలని, సైబర్ వారియర్స్ సైబర్ నేరాల పై ప్రజలను అప్రమత్తం చేస్తూ సైబర్ నేరస్తులను గుర్తించేందుకు నూతన టెక్నాలజీనీ ఉపయోగించటం తో పాటు క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేయడం ద్వారా సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని ఎస్పి సూచించారు.ఈ సమీక్షలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ రాజు, సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.