స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు

Sep 18, 2025 - 19:33
 0  10
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు

బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు ధారాసింగ్, కురువ చిన్న మల్లయ్య,

 చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య,బిజెపి పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ గణేష్ రెడ్డి,బిజెపి పార్టీ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కత్తి జానీ,చిన్నంబావి మండల పరిధిలోని బెక్కేం గ్రామంలో గ్రామంలో చిన్నంబావి మండల బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య  ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ శక్తి కేంద్రం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు ధారసింగ్, కురువ చిన్న మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గారి శ్రీధర్ రెడ్డి, పాల్గొన్నారు. మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య మాట్లాడుతూ ఇల్లు, గల్లి, బడి, గుడి, పని చోటు, బస్టాండ్లు ప్రతి చోటు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, ఈగలు, అంటు రోగలు రాకుండా పరిశుభ్రత పాటించాలని, క్రిములను తరిమి కొట్టాలని, వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రత, పరిసరాల శుభ్రత, గ్రామ శుభ్రత కోసం అందరు పనిచేయాలని గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. శుభ్రత లేకపోవడం రోగాలకు మూల కారణమని అందుకే మన ఊరును శుభ్రంగా ఉంచుకుంటే మనమందరం బాగుంటామని మనం బాగుంటే గ్రామం బాగుంటుంది అనే సందర్భంగా తెలియజేశారు. గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని భావించిన మన ప్రధాని నరేంద్ర మోడీ కోరిక మేరకు మనమందరం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లక్ష్యంగా పనిచేద్దాం  అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గణేష్ రెడ్డి, మండల నాయకులు గోపి నాయుడు, సాయి ప్రణీత్, దాసరి నారాయణ, డి వెంకటయ్య, గ్రామ నాయకులు డి యన్ రాము, హరికాంత్, గ్రామ ప్రజలు, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333