అంతరాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలి

కలెక్టర్ ఎస్ వెంకట్రావు

Mar 26, 2024 - 21:05
 0  2
అంతరాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలి
అంతరాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలి

సూర్యాపేట :-  శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి చెక్ పోస్ట్ల వద్ద నిఘా కట్టుదిట్టం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.

 మంగళవారం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలోని రామ్ కో లర్నింగ్ సెంటర్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జిల్లా, సూర్యాపేట జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ నగదు, మద్యం, మత్తు, పదార్థాలు విలువైన వస్తువులు వంటి వాటి అక్రమ రవాణా ను అడ్డుకట్ట వేసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు  నిఘాను కట్టు తీర్థం చేయడం జరిగిందని రెండు జిల్లాల అధికారులు సమన్వయంతో సహకారంతో గత ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించామని అలాగే ఈ ఎన్నికలలో కూడా రెండు జిల్లాల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు క్రియాశీలకంగా పనిచేయాలని ఈ ఎన్నికల్లో కూడా రెండు జిల్లాల అధికారులు తమ వంతు సహకారాన్ని అందించాలని ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలు కి లోబడి పని చేయాలని కలెక్టర్ తెలిపారు రెండు జిల్లాల నోడల్ అధికారులు కూడా పరస్పర సహకారంతో పనిచేయాలని ఈ ఎన్నికలను కూడా విజయవంతంగా నిర్వహించడానికి అధికారుల సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అన్నారు ఎన్టీఆర్ పలనాడు జిల్లాలకు సరియైన సహకారం అందిస్తూ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.

 ఎన్టీఆర్ జిల్లాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్పీలు సత్కరించారు.  

   ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, ఎన్టీఆర్ జిల్లా సిపి కాంతి రానా టాటా ,సూర్యపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, యంసిసీ నోడల్ ఆఫీసర్ సతీష్ కుమార్, నందిగామ ఆర్వో ఏ రవీందర్రావు, జగ్గయ్యపేట ఆర్వో జి వెంకటేశ్వర్లు, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, పోలీస్ నోడల్ అధికారి ఎన్టీఆర్ జిల్లా ఎం కృష్ణమూర్తి నాయుడు, సూర్యాపేట జిల్లా ఎం నాగేశ్వరరావు ,ఎల్డీఎం సూర్యాపేట జిల్లా బాపూజీ, ఎల్ డి ఎం ఎన్టీఆర్ జిల్లా కే ప్రియాంక. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333