శాసన మండలి ఉప ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలు,

May 18, 2024 - 22:14
 0  26
శాసన మండలి ఉప ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలు,

 ర్యాలీలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలి.

-జిల్లా ఎస్పి రాహూల్ హెగ్డే

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉమ్మడి జిల్లాలో శాసనమండలి పట్టబద్రుల ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు.   పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనల పరిధి దాటకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని అన్నారు. అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని వారి ప్రసంగాలలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని అన్నారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని అన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల ఇండ్ల గోడలపై రాతలు రాయటం, హోర్డింగులు ఏర్పాటు చేయడం వంటివి చేయవద్దని అన్నారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్ట్ లు పెట్టరాదని అన్నారు.ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు చేయవలసి వస్తే సి- విజిల్ యాప్ ద్వారా పిర్యాదు చేయవచ్చని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333