గ్రామాలు, పట్టణాల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
మార్చ్ 26, మంగళవారం మహబూబాబాద్ జిల్లా :- మంగళవారం నాడు, హైద్రాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో గ్రామాలు, పట్టణాల్లో త్రాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సిఎంఆర్ లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టరేట్ ఎన్.ఐ.సి వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు, రెవెన్యూ లెనిన్ వత్సల్ టోప్పో, డేవిడ్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో ని నాలుగు పురపాలక సంఘాలు, (461) గ్రామ పంచాయితీల్లో త్రాగు నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యచరణ ప్రకారము చర్యలు తీసుకోవాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని,ఐకెపి ఆధ్వర్యంలో (49), పిఏసీఎస్ ఆధ్వర్యంలో (125), జిసీసీ (7), ఇతర (4) కలిపి మొత్తం (185) కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు, అట్టి కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ప్యాడి క్లీనర్, టార్పలిన్స్ , గన్నిస్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, కస్టం మిల్లింగ్ రైస్ (సిఏంఆర్) లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ప్రసాద్, డిసిఏస్ఓ కృష్ణవేణి, డిసిఓ,డిఎఓ, డిహెచ్ఓ మరియన్న, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు...