సద్దలోనిపల్లి శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో హుండీ చోరీ
జోగులాంబ గద్వాల 26 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- మండలం పరిధిలోని సద్దలోని పల్లి గ్రామంలో శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో హుండీ పగలగొట్టి పట్టపగలే మూడు నుంచి నాలుగు లక్షల వరకు దొంగతనం జరిగినట్టు ఆలయ చైర్మన్ రామకృష్ణ తెలిపారు.పూజారి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు దేవాలయంలో వచ్చి ఉండేవాడని, కానీ శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకే రావడం జరిగిందని, ఆలయ చైర్మన్ కు చోరీ జరిగిన విషయం వెంటనే తెలుపకుండా, ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని పూజారి ఆలస్యంగా తెలపడంతో పూజారి పై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి చోరికి పాల్పడినటువంటి నిందితులను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.
వివరణ.
తెలంగాణవార్త నుంచి చరవాణి ద్వారా వివరణ కోరగా ఆలయ చైర్మన్ రామకృష్ణ గుడి హుండీలో దొంగతనం జరిగిన విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు. మల్దకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.