NZB:పోలీసు కమిషనర్ పరిధిలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు..
తెలంగాణ వార్త 16 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- నిజామాబాద్ పోలీసు కమిషనరెట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ సీపీ.కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.వరుస పండుగలు,పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు,సమావేశాలు,సభలు నిర్వహించరాదు.ముఖ్యంగా ఒకే చోట జనాలు గుమగూడి ఉండడం నిషేదం.అలాంటి వారిపై ఈ సెక్షన్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తారు.144 సెక్షన్ కు లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సీపీ.కల్మేశ్వర్ సూచించారు.