విద్యార్థి ఉద్యమాల దిక్సూచి పిడిఎస్ యు

Oct 13, 2024 - 16:20
 0  29
విద్యార్థి ఉద్యమాల దిక్సూచి పిడిఎస్ యు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  విద్యార్థి ఉద్యమాల దిక్సూచి పిడిఎస్ యు విద్యార్థి ఉద్యమాల దిక్సూచి పిడిఎస్ యు అని పిడిఎస్ యు పూర్వ, ప్రస్తుత విద్యార్థి నేతలు పేర్కొన్నారు. అక్టోబరు 24 న ఓయూలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో జరిగే పిడిఎస్ యు  అర్ధ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆత్మకూర్ (ఎస్ )మండలం ఏపూరు గ్రామంలో అర్ధ శతాబ్ది ఉత్సవాల సభను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పి డి ఎస్ యు నేతలు రిటైర్డ్ హెడ్ మాస్టర్లు పుప్పాల మల్లయ్య, బిక్షం, మాజీ నాయకులు కునుకుంట్ల సైదులు పాల్గొని మాట్లాడుతూ 70వ దశకంలో ఆవిర్భవించిన పిడిఎస్ యు. ఆవిర్భవించిన  నాటి నుంచి నేటి వరకు శాస్త్రీయ విద్యాసాధనగా, సమానత్వ నూతన సమాజం లక్ష్యంగా అసమాన్య పోరాటాలు నిర్వహించింది. నిర్వహిస్తూనే ఉంది. సంక్షేమ హాస్టల్ ,ఇంటర్,డిగ్రీ, ఉన్నత విద్య విద్యార్థుల సమస్యలు మొదలుకొని రాజ్యహింసకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేసింది. మెడికల్ కాలేజ్ విద్యార్థుల క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా రాష్టవ్యాప్త ఉద్యమం చేసి నాటి సిఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయించిన ఘనత ఒక్క పిడిఎస్ యు కే ఉందని పేర్కొన్నారు. ఈ పోరాటాల ఫలితంగా రాజ్యహింస,జైలునిర్బంధాలను  చవిచూసింది. ఎంతోమంది విద్యార్థి రత్నాలు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. అయినా బెదరక ఉక్కు సంకల్పం అంకుటీత దీక్షతో విద్యార్థి ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం భిన్న జాతులు, మతాల దేశంలో ఒకే దేశం,ఒకే మతం,ఒకే ఆహారం, ఒకే ఎన్నిక పేర ప్రజల మధ్య చిచ్చు పెడతుందని అన్నారు. రైతు చట్టాలు ,నాలుగు లెబర్ కోడ్స్, నూతన జాతీయ విద్యా విధానం -2020, జమీలి ఎన్నికలతో రైతు,కార్మిక, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తునని అన్నారు. నాటి పోరాట స్ఫూర్తితో నేటి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని, అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే అర్థ శతాబ్ద ఉత్సవ సభను జయప్రదం చేయాలని దీనికి పిడిఎస్యు పూర్వ మరియు ప్రస్తుత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. *ఈ సమావేశంలో ప్రస్తుత పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు కంచనపల్లి శ్రీను, మాజీ జిల్లా కార్యదర్శి వీరబోయిన లింగన్న, జిల్లా నాయకులు బోల్క పవన్, మద్దెల వేణు, చిత్తలూరి ఉదయ్, సుదగాని వెంకన్న, బండి రవి, పవన్, వెంకటేష్, ఉపేందర్,వంశీ, రహీం,ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.