ఎడ్ల బండ్లపై వరంగల్ భారాస రజతోస్తవ సభకు వెళ్లిన రైతులకు ఘన సన్మానం

Apr 29, 2025 - 20:59
 0  61
ఎడ్ల బండ్లపై వరంగల్ భారాస రజతోస్తవ  సభకు వెళ్లిన రైతులకు ఘన సన్మానం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఎడ్ల బండ్లపై వరంగల్ భారాస రజతోస్తవ సభకు వెళ్లిన రైతులకు ఘన సన్మానం. ఈనెల 27న వరంగల్లో నిర్వహించిన భారాస రజతోత్సవ వ బహిరంగ సభకు ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంనుంచి, రామోజీ తండా నుంచి 16ఎడ్ల బండ్ల ద్వారా రైతుల యాత్రను ఈనెల 22న భారాస సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో పూజలు చేసి ప్రారంభించారు. రైతులు విజయవంతంగా బహిరంగ సభను పూర్తి చేసుకొని రావడంతో భారాస మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.రామోజీ తండాలో, ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో జడ్పి మాజీ వైస్ చైర్మన్ గొప్పగాని వెంకటనారాయణ, పాక్స్ చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తూడి నర్సింహారావు రైతులకు శాలువాలు, పూల దండలతో సన్మానించారు. త్వరలో రాష్ట్ర అధినేత కెసిఆర్ తో కల్పించి సన్మానం చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముద్దం కృష్ణారెడ్డి, కసగాని బ్రహ్మం,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, సోమిరెడ్డి వెంకటరెడ్డి, వళ్ళోజు ప్రశాంత్,గిలకత్తుల సోమయ్య, జైత్య, బోళ్ల వెంకట రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.